ప్రాణం తీసిన వాట్సాప్ ఫోటో…

237
WHATSAPP Image
- Advertisement -

నేటి యువ‌త‌ ఇంట్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ‌గా ఉంటున్నార‌నే చెప్పాలి. వాట్సాప్ ఉన్న ప్ర‌తి వ్య‌క్తికి 10 గ్రూప్ ల‌లో స‌భ్యులుగా ఉంటారు. కొన్ని సంద‌ర్భాల‌లో మ‌నం చేసే పోస్టులు వివాదానికి దారితీస్తుంటాయి. ఇలాంటి సంఘ‌ట‌నే హ‌ర్యానాలో చోటు చేసుకుంది. గ్రూప్ అడ్మిన్ గా ఉన్న ఓ వ్య‌క్తి అందులో త‌న ఫోటో పెట్ట‌డంతో ప్రాణాలు కోల్పోయాడు.

Whatsapp Image

వివ‌రాల్లోకి వెళితే.. హ‌ర్యానాలోని సోనిప‌ట్ లో ల‌వ్ జోహ‌ర్స్(28) అనే వ్య‌క్తి జోహార్స్ వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గా ఉన్నాడు. ఈ గ్రూప్ లో గోత్రా క‌మ్యూనిటీకి చెందిన ప‌లువురు వ్య‌క్తులు స‌భ్యులుగా ఉన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రికి ఓటు వేయాల‌నేది గ్రూప్ స‌భ్యులు నిర్ణయం తీసుకుంటారు.

ఆదివారం రాత్రి గ్రూప్ అడ్మిన్ ల‌వ్ జోహార్ త‌న‌ వ్యక్తి గత ఫోటో గ్రూప్ లో పోస్ట్ చేశాడు. వ్య‌క్తిగ‌త ఫోటో పోస్టు చేయడంతో అత‌నితో దినేష్ అని స‌భ్యుడు వాగ్వాదానికి దిగాడు. దినేశ్ ఇంటికి వెళ్లి గొడ‌వ‌ను స‌రిదిద్దుకోవాల‌ని అనుకున్న జోహార్ త‌న ముగ్గ‌రు సోద‌రుల‌తో క‌లిసి దినేశ్ ఇంటికి వెళ్లాడు. అయితే దినేశ్ కుటుంబ స‌భ్యులు మాత్రం జోహార్, అత‌ని సోద‌రుల‌పై రాళ్ల దాడి చేశారు.

ఈ దాడిలో జోహార్ ప్రాణాలు కోల్పోగా.. అత‌ని సోద‌రులు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు చేయ‌గా చిన్న విష‌యానికి ప్రాణాల మీద‌కు తెచ్చ‌కున్నార‌ని చెప్పారు. జోహార్ పై దాడికి పాల్ప‌డిన దినేశ్‌, అత‌డి కుటుంబ స‌భ్యుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిందితులు ప‌రారిలో ఉన్నార‌ని, త్వ‌ర‌లో ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు చెప్పారు.

- Advertisement -