అగ్ర దర్శకులంతా ఒకే చోట..!

266
Tollywood Top Directors

ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక పని చేసే వ్యక్తులు తరచు కలుసుకుంటూ ఉంటారు. టాలీవుడ్ లో అయితే కాస్త ఎక్కువగానే ఉంది. సినిమా విడుదల సమయంలో ఎంత పోటీ పడినా కూడా ఒక చోట కలుసుకున్నప్పుడు మాత్రం మన సినిమా వాళ్లు చాలా హ్యాపీగా గడిపేస్తారు. టాలీవుడ్ లో కొన్ని గ్రూపులు ఉన్నాయి. అందులో దర్శకుల గ్యాంగ్ చాలా పెద్దదని చెప్పాలి. ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా కలిసిపోతూ ఎంజాయ్ చేస్తారు.

Tollywood Top Directors

ఇంతకుముందు సీనియర్ దర్శకులు కొంత మంది మాత్రమే తరచు కలిసి మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు వారితో పాటు యువ దర్శకులు కూడా కలుస్తూ మంచి వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. ఇక సోమవారం రాత్రి కూడా స్టార్ దర్శకులంతా ఒక చోట చేరారు. వంశీ పైడిపల్లి తన ఇంట్లో సోమవారం రాత్రి ఓ పార్టీని నిర్వహించగా, ప్రముఖ దర్శకులంతా హాజరయ్యారు. వీరంతా కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్న వంశీ పైడిపల్లి, “అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను” అని క్యాప్షన్ పెట్టాడు.

ఈపార్టీలో దర్శకధీరుడు రాజమౌళి, సుకుమార్‌, క్రిష్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి ఉన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి తన ఇంటికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలని వంశీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వీరంతా తమతమ చిత్రాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి షేర్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం వంశీ మహేష్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.