- Advertisement -
అమెరికాలో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతిని నిరాకరించింది ఎఫ్‌డీఐ. అమెరికాలో అక్యుజెన్ అనే ఫార్మా కంపెనీ కొవాగ్జిన్ సప్లై కోసం భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అత్యవసర వినియోగానికి నో చెప్పడంతో ఇప్పుడు తాము పూర్తిస్థాయి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటామని అక్యుజెన్ వెల్లడించింది.
కొవాగ్జిన్‌ను అమెరికాకు తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నామని అక్యుజెన్ సీఈవో శంకర్ ముసునూరి స్పష్టం చేశారు. యూఎస్ ఎఫ్‌డీఏ చెప్పిన ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికోసం కూడా మరింత డేటా వాళ్లు కోరారని ఆ సంస్థ చెప్పింది.
- Advertisement -