కోవాగ్జిన్‌ టీకాపై లాన్సెట్‌ కథనం..

177
covid
- Advertisement -

కరోనా కట్టడిలో భాగంగా భార‌త్ బ‌యోటెక్ సంస్థ త‌యారు చేసిన కోవాగ్జిన్ టీకాపై ది లాన్సెట్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ టీకా తీసుకున్న వారిలో 77.8 శాతం ప్ర‌భావంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు ద లాన్సెట్ తెలిపింది.

నిర్జీవ వైర‌స్‌తో సాంప్ర‌దాయ‌ప‌ద్ధ‌తిలో కోవాగ్జిన్ టీకాను తయారు చేస్తారు. ఈ టీకా తీసుకున్న‌వారిలో యాంటీబాడీలు దండిగా ఉత్ప‌త్తి అవుతున్న‌ట్లు నివేదిక‌లో తెలిపారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ నుంచి 2021 మే వ‌ర‌కు కోవాగ్జిన్ స‌మ‌ర్థ‌త‌పై స్ట‌డీ నిర్వ‌హించారు. 18 ఏళ్ల నుంచి 97 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న 24,419 మందిపై అధ్య‌య‌నం చేప‌ట్టిన‌ట్లు మెడిక‌ల్ జ‌ర్న‌ల్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. భార‌త్ బ‌యోటెక్‌, ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలో స్ట‌డీ జ‌రిగింది.

- Advertisement -