బాహుబలికి ‘ఫ్యాషన్ డిజైనర్’ విషెస్

222
- Advertisement -

సరిగ్గా 32 సంవత్సరాల క్రితం ‘వంశీ’ దర్శకత్వంలో రూపొంది ఎన్నో సంచనాలు సృష్టించిన సినిమా ‘లేడీస్ టైలర్’. ఈ సినిమాకి సీక్వెల్ గా మళ్ళీ వంశీ దర్శకత్వంలో ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ రూపొందుతున్నది. చాలాకాలం నుండి సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు వంశీ ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్‌ అంటూ ముందుకు రాబోతున్నాడు.

త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాహుబలి టీంకి స్పెషల్ విషెస్ చెప్పింది. సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించిన ఫ్యాషన్ డిజైనర్ టీం తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిందని…భారతీయ సినిమా చరిత్రలోనే రూ. 1000 కోట్లు కలెక్షన్ చేయాలని ఆకాంక్షించింది.

Fashion Designer Team wishes Baahubali

సుమంత్ అశ్విన్ హీరోగా అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడి బ్రహ్మ “మణిశర్మ” సంగీతం సమకూర్చాడు. ప్రముఖ దర్శకుడు వంశీ సినిమాల్లోని గోదావరి అందాలు, ఆ గోదావరి అందాలతో పోటీ పడే హీరోయిన్ల అందాలు, సంభాషణలు, సంగీతం, చిత్రీకరణ ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి మేటి దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన అలనాటి మేటి చిత్రం ‘లేడీస్‌ టైలర్‌’ అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది. రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. ఆ పాత మధురం ‘లేడీస్‌ టైలర్‌’ సినిమాకి సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు అభిరుచిగల నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి.

Fashion Designer Team wishes Baahubali

- Advertisement -