నాగ్ లేకపోతే నేను లేను…

276
Yes, I Rejected Mahesh’s Film
- Advertisement -

నిర్మలమ్మ, అన్నపూర్ణ తర్వాత తెలుగునాట అమ్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది ఆమె. వైవిధ్యమైన పాత్రలు పోషించగల యాక్టర్‌గా  టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. గ్యాంగ్ లీడర్, ఆమె లాంటి చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆమెను టాలీవుడ్ అమ్మ అంటే అతిశయోక్తి కాదేమో. ఆమె సుధ 40 ఏళ్లపాటు సినీ రంగానికి  సేవలందించిన ఆమె నీ ఇటీవల ఓ యూట్యూబ్ చానెలకిచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన విశేషాలను వెల్లడించారు.

సినీ పరిశ్రమలో నాగార్జున, చిరంజీవి ఫ్యామిలీలతో మంచి అనుబంధం ఉందని చెప్పిన సుధ  జగపతిబాబు  చాలా ఇష్టం అని  వెల్లడించారు. ఇక నాగ్ లేకపోతే తాను బతికి ఉండేదాన్ని కాదని చెప్పింది. అపెండిసైటిస్‌తో బాధపడుతూ సృహతప్పి పడిపోతే నాగార్జున హాస్పిటల్‌కు పంపించి ఆపరేషన్ చేయించాడని… ఇంకా భూమ్మిద ఉన్నానంటే కారణం నాగార్జున  మాత్రమే అని సుధ పేర్కొన్నారు. అందుకే నాగార్జున అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు.

మరోసారి రావోయి చందమామ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డాను. శరీరంలో భాగం పనిచేయని పరిస్థితి ఏర్పడింది. దాంతో బెడ్ పైన పడుకోబెట్టారు. వెంటనే నాగార్జున స్పందించి తన పర్సనల్ డాక్టర్ పిలిపించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పింది.

ఇటీవలి కాలంలో ‘శ్రీమంతుడు’ సినిమాను అందుకే వదులుకున్నా అని చెప్పింది. అంతకుముందు మహేష్‌తో ‘వంశీ’, ‘మురారి’, ‘అతడు’, ‘దూకుడు’ వంటి సినిమాల్లో మంచి రోల్స్‌ చేశాను. ‘శ్రీమంతుడు’లో కూడా మహేష్‌కు తల్లిగా నటించమని అడిగారు. కానీ, ఆ రోల్‌కు కనీస ప్రాధాన్యం కూడా లేదు. అందుకే ఆ పాత్ర చేయనని చెప్పాన’ని తెలిపింది సుధ.

సినీ పరిశ్రమలో నాకు నచ్చిన కొందరు వ్యక్తుల ఆకస్మిక మృతితో తాను దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆ విషాదం నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని తెలిపింది. ఉదయ్ కిరణ్, శ్రీహరి లాంటి వ్యక్తుల వరుస మరణాలతో కుంగిపోయాను. కొడుకు లాంటి ఉదయ్ కిరణ్ మరణం చాలా విషాదం నింపింది అని కన్నీరుమున్నీరయ్యారు.

నన్ను ఉదయ్ కిరణ్ అమ్మా అని పిలిచేవాడు. నా కూతురు వాడితో ఆడుకొనేది. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత నా కూతురు ఫోన్ చేసి మనతో ఉంటే చనిపోయేవాడు కాదు కదా అని నాతో అన్నది. ఒకరోజు మేము షూటింగ్‌లో ఉండగా వచ్చి ఉదయ్ కిరణ్ మోకాళ్లపై కూర్చొని బాగా ఏడ్చాడు. అప్పటికే పెళ్లి ఆగిపోయింది. తల్లి చనిపోయి చాలా బాధలో ఉన్నాడు. వాడిని దత్తత తీసుకొని ఉంటే బతికి ఉండేవాడు అని సుధ ఉద్వేగానికి లోనయ్యింది.

- Advertisement -