నిన్న ఆడియో, రేపు వీడియో

247
trs
- Advertisement -

ఫామ్ హౌస్ వీడియోలు విడుదలకు రెడీ
వత్తిళ్లు భరించలేకే వీడియో రికార్డు
బిజెపి దూతల బ్లాక్ మెయిల్స్ తో ఎమ్మెల్యేల ఇగోహర్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టి.ఆర్.ఎస్. పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు కూడా విడుదల కానున్నాయని తెలిసింది.జాతీయస్థాయిలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించిన రెండు ఆడియో రికార్డులు భారతీయ జనతా పార్టీ పెద్దల బండారాన్ని బట్టబయలు చేయగా దానికి మరింత ఊతమిచ్చే విధంగా వీడియోలను కూడా బయటపెట్టేందుకు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులు ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది. ఈ వీడియాల్లో జనరల్ ఆడియో కూడా రికార్డయ్యిందని, కొన్ని మాటలు కూడా వినిపిస్తాయని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులు పక్కా స్కెతోనే బి.జె.పి.నేతల ప్రతినిధులుగా ఫామ్ హౌస్ కు వచ్చిన వారి బండారాన్ని రికార్డు చేశారని కొందరు నాయకులు వివరించారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బి.జె.పి.లో చేరాలని వత్తిడి చేశారని, ఈ వత్తిళ్ళు భరించలేకనే ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావుల కూడబలుక్కొని బి.జె.పి.నుంచి వస్తున్న వత్తిళ్ళు, బ్లాక్ మెయిల్ రాజకీయలకు ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే సాంకేతిక నిపుణుల సహకారంతో పగడ్బందీగా సి.సి.కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు, డిజిటల్ మైలు తదితర అధునాతన టెక్నాలజినీ వినియోగించుకొని బి.జె.పి.పెద్దల కుట్రలను బహిర్గతం చేయాలనే పట్టుదలతోనే ముందస్తుగా ఏర్పాట్లు చేసుకొన్నారని తెలిపారు.

బిజెపి దూతలు చేసిన వత్తిళ్ళు, బ్లాక్ మెయిల్స్ తో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తదితరుల ఇగో హర్ట్ అయ్యిందని, అందుకే బిజెపి బండారాన్ని బట్టబయలు చేయాలని నిశ్చయించుకొన్నారని తెలిపారు. బి.జె.పి.తరుపున మధ్యవర్తులుగా వచ్చిన నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజులును పోలీసులకు పట్టించాలనే కృతనిశ్చయంతోనే ఆ ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా వ్యవహరించారని, ఏ ఒక్క సందర్భంలో కూడా ఆ ముగ్గురు మధ్యవర్తులకు ఎలాంటి అనుమానాలు రాకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్తగా వ్యవహరించారని తెలిపారు. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతోపాటుగా ఆడియో రికార్డులు కూడా ఇచ్చామని, తాము వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, డిజిటల్ పరికరాలను కూడా పోలీసులకు అందజేశామని వివరించారు. ఆడియోలను రెండు భాగాలుగా విభజించి మీకు (మీడియా) అందేటట్లు చేశామని, అదే పద్దతిలో వీడియో రికార్డులను కూడా విడుదల చేస్తామని ఆ నాయకులు వివరించారు. ఈ వీడియోలను చూస్తే మరింత స్పష్టంగా బిజెపి దూతల బండారం తెలిసిపోతుందన్నారు. ఫామ్ హౌస్ లోకి ప్రవేశిస్తున్న దగ్గర్గుంచి, వారిని రిసీవ్ చేసుకోవడం, లోపలికి రావడం, పరిచయాలు చేసుకోవడం, కలిసి ముచ్చటించుకోవడం… వారి బాడీ లాంగ్వేజ్… ఇలా ఒక్కటేమిటీ అన్ని కోణాల నుంచి బిజెపి మధ్యవర్తుల వ్యవహారమంతా ప్రపంచానికి తెలిసిపోతుందని తెలిపారు. బిజెపి చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ను బట్టబయలు చేసి రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తానికి కమలం పార్టీ వికృత చేష్టలనీ తెలిసేటట్లు చేయాలని కంకణం కట్టుకొన్న ఎమ్మెల్యేలు ‘ఆపరేషన్ ఫామ్ హౌస్’ను చేపట్టారని వివరించారు.

అందుకే బిజెపి దూతలు అడ్డంగా దొరికిపోయారని, దీన్నిబట్టి టి.ఆర్.ఎస్.ఎమ్మెల్యేలు, ఎం.పీ.ల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్పక తప్పదని నిరూపించామని ఆ నాయకులు సగర్వంగా చెబుతున్నారు. వాస్తవానికి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తరహా నేతలు తెలంగాణలోనూ ఉన్నారని బిజెపి అగ్రనేతలు బహిరంగంగా చెప్పడం, దానికి అనుబంధంగా కమలం పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా కొద్దిరోజుల క్రితం ఏయే జిల్లాల నుంచి టి.ఆర్.ఎస్.పార్టీ ఎమ్మెల్యేలు బి.జె.పి.లోనికి రాబోతున్నారని చేసిన ముందస్తు హెచ్చరికతోనే తమ పార్టీ అధిష్టానం అప్రమత్తమయ్యిందని, తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అలర్ట్ అయ్యారని వెల్లడించారు. కానీ ఢిల్లీని ఏలుతున్న బి.జె.పి.నేతలు, వారికున్న ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ‘ఆపరేషన్ ఫామ్ హౌస్’ను గుర్తించలేకపోయాయని సగర్వంగా చెబుతున్నారు. డబ్బు, అధికార బలంతో బిజేపీయేతర రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చడం, పార్టీల్లో చిచ్చుపెట్టి విభజించి పాలించు సూత్రాన్ని అమలుచేస్తూ రాజకీయాలను బిజెపి నేతలు భ్రష్టుపట్టించారని, అందుకే కమలం పార్టీ ఆగడాలు, అరాచకాలకు ఎక్కడో ఒకచోట బ్రేకులు వేసేందుకే ఆపరేషన్ ఫామ్ హౌస్ ను చేపట్టాల్సి వచ్చిందని అంటున్నారు.

అందుకే ఎంతో స్పష్టంగా రికార్డయిన వీడియోలను కూడా విడుదల చేయాలని నిర్ణయించుకొన్నామని ఆ నాయకులు వివరించారు. ఈ వీడియోలను ఎక్కడా ఎడిట్ చేయడం లేదని, రికార్డయిన విజువల్స్ మొత్తాన్ని యధావిధిగా విడుదల చేస్తామని, కాకుంటే లెంగ్ ఎక్కువగా ఉంటున్నాయని, అందుచేతనే ఖాళీగా ఉన్న విజువల్స్ ను కట్ చేద్దామా? వద్దా? ఆ ఖాళీ సమయాన్ని కూడా విడుదల చేద్దామా? అని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. అయితే పోలీసులకు మాత్రం ఎక్కడా ఒక్క సెకండ్ వీడియోను కూడా కట్ చేయకుండా యధావిధిగా మొత్తం వీడియో రికార్డులను ఇచ్చామని, కాకుంటే మీడియాకు ఇచ్చే సమయంలో ఆ ఖాళీ సమయాన్ని కట్ చేద్దామా? వద్దా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఎలాగూ పోలీసులకు పూర్తి వీడియోలను ఇచ్చాం గనుక మీడియాకు ఖాళీ టైం వీడియోను కట్ చేసి మిగతా మొత్తం వీడియోను విడుదల చేస్తేనే మంచిదనే అభిప్రాయంతో ఉన్నామని ఆ నాయకులు వివరించారు. ఇక వీడియోలో ఎలాంటి దృశ్యాలు నిక్షిప్తమై ఉన్నాయో… ఎలాంటి అదనపు సమాచారం ఉందో… ఈ వీడియో రికార్డులతో బిజెపి దూతలు, వారి వెనుక ఉన్న పెద్దల ప్రమేయంపై ఎలాంటి సమాచారం దొరుకుతుందో చూడాలి…

ఇవి కూడా చదవండి..

ప్రజలు కోరితే రాజాకీయాల్లోకి వస్తా:కంగనా

సీఎం కేసీఆర్ సభకు సర్వం సిద్ధం

మునుగోడులో మరో భారీ కుట్ర

 

- Advertisement -