సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే పదవీ విరమణ..

158
- Advertisement -

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే శుక్రవారం పదవీ విరమణ చేశారు. బోబ్డే స్థానంలో తెలుగువాడైన జస్టిస్ ఎన్వీ రమణ శనివారం నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. బోబ్డే 2019లో సీజేఐగా నియమితులయ్యారు. 1978లో ఆయన న్యాయవాద ప్రస్థానం ప్రారంభమైంది. తన కెరీర్‌లో బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యారు. కాగా, కరోనా విలయం కారణంగా విచారణలన్నీ వర్చువల్ గా సాగుతున్నప్పటికీ, ఇది ప్రత్యేక సందర్భం కావడంతో సుప్రీం కోర్టు రూమ్ లోనే బోబ్డే వీడ్కోలు సభను నిరాడంబరంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఏ బోబ్డే మాట్లాడుతూ, ”భారత సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నా వంతు కృషి చేశాను. ఇప్పుడు పరిపూర్ణ సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నాను. జడ్జిగా 21 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. ఆనందం, సద్భావన నాకు బాగా ఇష్టమైన జ్ఞాపకాలు. గతంలో చాలా సార్లు సెర్మోనియల్ బెంచ్ లో సభ్యుడగా ఉన్నాను కానీ చివరి రోజున నాలో మిశ్రమ భావాలున్నందున విషయాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నా..” అంటూ భావోద్వేగానికి గురయ్యారు చీఫ్ జస్టిస్ బోబ్డే.

- Advertisement -