టీమిండియా క్రికెట‌ర్లుకు అభిమాని సర్‌ప్రైజ్‌.. చిక్కుల్లో పడ్డ ఆటగాళ్లు..

212
Indian cricketers
- Advertisement -

భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లు ఒకవైపు ప్రాక్టీస్‌ను చేస్తూనే.. మరోవైపు కాస్త సమయం దొరికినప్పుడు ఎంజాయ్ చేసున్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఏంచక్కా భోజనం చేశారు. భోజ‌నం చేసిన న‌లుగురు భార‌త క్రికెట‌ర్లు బిల్ చెల్లించేందుకు వెళ్లారు. అయితే, వారి బిల్లుని అప్పటికే ఓ వ్య‌క్తి చెల్లించాడని సిబ్బంది చెప్పారు. దీంతో బిల్లు చెల్లించి క‌నీసం ముఖం కూడా చూపించ‌కుండా వెళ్లిపోయిన ఆ వ్య‌క్తి గురించి తెలుసుకుని భార‌త క్రికెట‌ర్లు ఆశ్చ‌ర్య‌పోయారు.

మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన‌ రోహిత్ శర్మ‌, రిష‌భ్‌ పంత్‌, శుభ్ మ‌న్ గిల్‌, న‌వ‌దీప్ సైని లకు ఈ అనుభ‌వం ఎదురైంది. నవల్దీప్ సింగ్ అనే టీమిండియా అభిమాని త‌మ బిల్లును చెల్లించాడని భార‌త క్రికెట‌ర్లు నలుగురూ తెలుసుకున్నారు. ఆ న‌లుగురు క్రికెట‌ర్లు తాను కూర్చున్న టేబుల్ ముందే కూర్చోవ‌డంతో నవల్దీప్ సింగ్ తెగ సంబ‌ర‌ప‌డిపోయి ర‌హస్యంగా వారి లంచ్ బిల్లును చెల్లించేశాడు. తాను బిల్లును చెల్లించినట్లు క్రికెట‌ర్ల‌కు తెలియదంటూ న‌వ‌ల్దీప్ ట్వీట్ చేశాడు.

అయితే ఇప్పుడు ఈ ట్వీటే టీమిండియా క్రికెటర్లను చిక్కుల్లో పడేలా చేసింది. సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జనవరి 7 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే రెండు జట్లూ బస చేస్తున్నాయి. సిడ్నీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండటంతో మ్యాచ్‌కి మూడు రోజులు ముందు మాత్రమే రెండు జట్లు అక్కడికి వెళ్లనున్నాయి. అంటే.. 4వ తేదీన ఇరు జట్లు సిడ్నీ చేరుకుంటాయి. ఈలోపే భారత ఆటగాళ్లు నలుగురు బయో-సెక్యూర్ బబుల్ రూల్స్ బ్రేక్ చేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై బీసీసీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

- Advertisement -