హుస్సేన్ సాగర్ పటిష్టత పరిశీలనకు నిపుణుల కమిటీ…

218
hussain sagar
- Advertisement -

హుస్సేన్ సాగర్ పటిష్టత,పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ చైర్మన్, మరో 9 మంది సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటుచేశారు.ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి,ఇద్దరు ఈఎన్సీలు, ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు, ముగ్గురు ఐఐటీ ప్రొఫెసర్లు మరో ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం 4 అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ సవాళ్లు, దాని పటిష్టత, నీటి సామర్థ్యత పరిస్థితి, వరద కాలువల పరిస్థితి, పటిష్టతను మెరుగుపరచడం తదితర అంశాలపై అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశాలు జారీచేశారు.

- Advertisement -