భజరంగ్‌ దళ్‌ ప్రేమ పెళ్లి..హుస్సేన్‌ సాగర్‌లో ప్రేమజంట..!

245
hussain sagar
- Advertisement -

ప్రేమికుల రోజున హైదరాబాద్‌ మేడ్చల్‌లోని కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఓ ప్రేమజంటకు పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దగ్గరి నుండి ఇంట్లో వారికి ముఖం చూపించలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఈ జంట చనిపోవాలని భావించారు. శుక్రవారం సాయంత్రం హుస్సేన్ సాగర్‌లోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే, వెంటనే అప్రమత్తమైన లేక్ పోలీసులు వీరిద్దరిని కాపాడారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఫిబ్రవరి 14న మేడ్చల్‌ కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో కనిపించిన ప్రేమ జంటను చూసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

వాలంటైన్స్ డే రోజు భజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన పని పెద్ద దుమారం రేపింది. విషయం తెలిసిన అమ్మాయి తండ్రి భజరంగ్ దళ్ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన జరిగినప్పటి నుంచి తన కుమార్తె కనిపించడం లేదని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆరుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

- Advertisement -