దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే:హరీష్ రావు

143
harish rao
- Advertisement -

దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెళ్లి , తిమ్మాపూర్ గ్రామాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు… మీ అందరి ఆశీర్వాదం తో చావు నోట్లోకి వెళ్లి,14 ఏండ్లు మడమ తిప్పని పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు..తెలంగాణ రాక మందు ఎట్ల ఉందో… తెలంగాణ వచ్చిన తరువాత ఎట్ల ఉందో మీకే తెలుసన్నారు.

17 రాష్ట్రాల్లో బీజేపీ,5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలు అధికారం లో ఉన్నాయి.. ఏ రాష్ట్రం లో కూడా తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదన్నారు. నిజమైన రైతు బంధు కేసీఆర్..తెలంగాణ రాక ముందు ఎన్ని కష్టాలు పడ్డామో మీ అందరికీ తెలుసు.. రైతు బంధు,రైతు బీమా, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు,బీడీ కార్మికుల పెన్షన్లు, ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.

వానా కాలం లో ఊసిల్లు వచ్చినట్టు ఎన్నికలొస్తే కాంగ్రెస్,బీజేపీ నేతలు వస్తరు.. బీజేపీ తెలంగాణ ఝుటా పార్టీ గా మారి పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాము డబ్బు ఇస్తున్నట్టు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకు 18 గంటలు కష్ట పడే మనిషిని నేను…నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేది నేను..మీకు ఏ అవసరం ఉన్న నాదగ్గరికి రండి…నేను మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న అన్నారు. కాలువల్లో భూములు కొల్పయిన దుబ్బాక రైతులకు సిద్ధిపేట లో ఎంత డబ్బు ఇచ్చామో అంత ఇప్పించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.

- Advertisement -