ఎగ్జిట్ పోల్స్ తో కాంగ్రెస్ లో కలవరం?

48
- Advertisement -

గత కొన్నాళ్లుగా దేశంలో హాట్ టాపిక్ గా నిలిచిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిన్నటితో పూర్తయ్యాయి. ఇక డిసెంబర్ 3న వెలువడే ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. కాగా నిన్న తెలంగాణ ఎన్నికలు ముగిసిన తరువాత ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జిట్ పోల్స్ తో ఆయా పార్టీలలో కలవరం మొదలైంది. ముఖ్యంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయే అవకాశం ఉందని మెజారిటీ సర్వేలు తేల్చి చెప్పాయి. అంతే కాకుండా మధ్య ప్రదేశ్ లో హస్తం పార్టీకి ప్రతికూల సర్వేలే వచ్చాయి. ఇక తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ మద్య మిశ్రమ సర్వేలు తెరపైకి వచ్చాయి. మిజోరాంలో ఏంఎన్ఎఫ్, జెడ్ పి ఏం పార్టీలదే హవా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఒక్క ఛత్తీస్ గఢ్ లో మాత్రమే హస్తం పార్టీ వైపు మొగ్గు చూపాయి అన్నీ సర్వే సంస్థలు. .

దీంతో నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కు భారీ ఓటమి తప్పదా అనే వాదన పొలిటికల్ సర్కిస్ లో గట్టిగా జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లోనూ విజయం సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నాప్పటికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ పార్టీని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మిశ్రమ ఫలితాలను వెల్లడించారు.. కొన్ని సర్వే సంస్థలు మళ్ళీ బి‌ఆర్‌ఎస్ దే అధికారం అని తేల్చి చెప్పగా, మరికొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ దే పైచేయి అని వెల్లడించాయి. దీంతో ఎటు తేల్చుకోలేని నివేధికలను ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో హస్తం నేతలు రిజల్ట్ పై కొంత భయం భయంగానే ఉన్నట్లు టాక్. మొత్తానికి హస్తం పార్టీకి ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకంగా మారిన సందర్భంలో అసలు ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.

Also Read:చలికాలంలో కీరదోస తింటే ఎన్నో ప్రయోజనాలో..!

- Advertisement -