తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం:సురేష్ రెడ్డి

241
- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. త్వరలో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరనున్నారు. సురేష్‌ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయిన కేటీఆర్‌ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

సురేష్ రెడ్డి అజాత శత్రువు అని…కేసీఆర్‌కి మంచి మిత్రుడు అని తెలిపారు మంత్రి కేటీఆర్. సభాపతిగా అందరి మన్ననలు అందుకున్నారని కొనియాడారు కేటీఆర్. సురేష్ రెడ్డికి మాకు భావసారుప్యత ఉందని పార్టీలో సముచిత స్ధానం కల్పిస్తామన్నారు. సురేష్ రెడ్డి అనుచరులకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు.

కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు సురేష్ రెడ్డి. రాజకీయ అవసరాల కంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడా ఆగిపోకుడన్నదే తన అభిమతమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పధంలో దూసుకుపోతుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానని త్వరలో కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్‌లో చేరుతానని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం నిశ్శబ్ద విప్లవం నడుస్తోందన్నారు.

- Advertisement -