- Advertisement -
క్యాథలిక్ మతాధిపతి మాజీ పోప్ బెనెడిక్ట్ 26 శనివారం ఉదయం 9.34గంటల సమయంలో పరమపదించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బెనడిక్ట్..2013లో వృద్ధాప్య కారణాలతో పోప్ పదవికి రాజీనామా చేశారు.
దాదాపు 600యేళ్ల క్రితం పోప్ పదవి నుంచి ఇలా అర్థాంతరంగా వైదొలగడం ఇదే తొలిసారి. గతంలో 1415లో క్రైస్తవుల రెండు గ్రూపుల మధ్య ఘర్షణల నేపథ్యంలో గ్రెగోరీ 12 రాజీనామా చేశారు.
బెన్‌డిక్ట్ హృద్రోగ ఇతర వ్యాధులకు చికిత్స నిమిత్తం వాటికన్‌లోని మేటర్ ఎక్లెసియే మొనాస్టరీలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా శనివారం ఉదయం మరణించినట్టు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ మాటియో బ్రూనీ చెప్పారు.
ఇవి కూడా చదవండి…
నూతన సంవత్సరం..ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని తల్లి మృతి..సీఎం కేసీఆర్, ప్రముఖుల సంతాపం
యాదాద్రిలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు.
- Advertisement -