మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు మహి. వి రాఘవ్ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని రాజకీయ మలుపులు .. ఆయన కొనసాగించిన పాదయాత్ర .. ప్రజలను ప్రభావితం చేసిన తీరును ఈసినిమాలో ఎక్కువగా చూపించనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు ముమ్మట్టి నటిస్తోన్నారు.
పలువురు నటీ నటులు ఈచిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో జీవితంలో ఎదురైన ముఖ్యమైన నేతలను సినిమాలో చూపించనున్నారు. ఇటివలే ఈసినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈటీజర్ కు మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ ఆశలు ఉన్నాయి.
అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈసినిమా విడుదల వాయిదా చేసుకున్నట్లు తెలుస్తుంది. మొదట ఈమూవీని డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆరోజు చాలా సినిమాలు విడుదల అవుతుండటంతో యాత్రను జనవరిలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారట.ఈవిషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించక పోయినా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.