కమల్‌పై కర్ణాటక హైకోర్టు ఫైర్

9
- Advertisement -

సినీ నటుడు కమల్ హాసన్‌పై మండిపడింది కర్ణాటక హైకోర్టు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగగా వాక్‌ స్వాతంత్య్ర హక్కను ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ఉపయోగించొద్దంటూ హెచ్చరించింది.

మీరు కమల్‌ హాసన్‌ కావొచ్చు.. ఎంత పెద్ద నటుడైనా కావొచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు మీకు లేదు. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు అని తెలిపింది. మీ కామెంట్స్‌ వల్ల అశాంతి ఏర్పడింది. నీరు, భూమి, భాష.. ఇవి ప్రజలకు ముఖ్యమైనవి. ఈ దేశ విభజన భాషా ప్రాతిపదికన జరిగింది. ఏ భాష మరొక భాష నుంచి పుట్టదు. మీ వ్యాఖ్యలతో కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశారు.

మీరేమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా..? ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు..? కన్నడ ప్రజలు మిమ్మల్ని ఏమి అడిగారు..? కేవలం క్షమాపణలే కదా…ఈ వ్యవహారంలో ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది అని తెలిపారు.

Also Read:GHMC:స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

- Advertisement -