నా మాటలను అపార్థం చేసుకున్నారు!

13
- Advertisement -

నా మాటలను అపార్థం చేసుకున్నారు అని నటుడు కమల్ హాసన్ లేఖ రాశారు. తమిళం నుండే కన్నడ భాష పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగగా దీనిపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘థగ్ లైఫ్’ ఆడియో విడుదల కార్యక్రమంలో కన్నడపై తను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లేఖ రాశారు కమల్‌. మనందరిదీ ఒకే కుటుంబం అనే ఉద్దేశంతోనే ఆ రోజు అలా మాట్లాడానని కానీ, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కేఎఫ్‌సీసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు కమల్‌హాసన్‌.

మీరేమైనా చరిత్రకారుడా ? ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారు ? అంటూ కమల్ హాసన్ ను ప్రశ్నించింది కర్ణాటక హైకోర్టు. ఈ విషయంలో ఒక్క క్షమాపణ చెబితే విషయం సద్దుమణుగుతుందని వ్యాఖ్యానించింది కర్ణాటక హైకోర్టు.

Also Read:GIC:హరితసేనలో రాథోడ్ అశోక్

- Advertisement -