ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం..

520
minister etela
- Advertisement -

నేడు హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఇండియా ల్యాబ్ ఎక్స్పో అండ్ ఫార్మా ప్రో ప్యాక్ ఎక్స్పో 2019ను మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ,ఫార్మా ఇండస్ట్రీస్‌కి హైదరాబాద్ కేంద్ర బిందువని.. ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని ఆయన అన్నారు.

అదేవిధంగా ప్రంపంచంలోనే అతి తక్కువ ధరకు నాణ్యమైన వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు అందిస్తున్న నగరం హైదరాబాద్ అని మంత్రి తెలిపారు. నగరంలోని సుల్తాన్ పూర్‌లో మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కును ఏర్పాటు చేశాము. హైదరాబద్‌లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు పన్ను రాయితీలు, సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి అన్నారు.

etela

ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ కంపెనీకి శంకుస్థాపన కూడా ఇక్కడ చేసాము. హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత అనువైన వాతావరణం ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ టీఎస్ ఐపాస్ చట్టాన్ని తీసుకురావడం ద్వారా పరిశ్రమలకు అన్ని అనుమతులను 15 రోజుల్లోనే ఇస్తున్నాము అని ఈటెల తెలిపారు.

ఎలాంటి మధ్యవర్తులు దళారులు లేకుండా నేరుగా ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పొందండి. ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి తోడ్పాటును అందించండి. తక్కువ ధరకు మందులు, వైద్య పరికరాలు అందించి ప్రజలకు సేవ చేయండి అని మంత్రి ఈటెల కోరారు.

- Advertisement -