లాక్ డౌన్ ప్రసక్తే లేదు: ఈటల

211
etela rajendar
- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు మంత్రి ఈటల రాజేందర్. దేశంలో 60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్ర లోనే నమోదు అవుతున్నాయిని….లక్షణాలు లేకుండా కరోనా విస్తరిస్తోందన్నారు.పి హెచ్ సి స్థాయి వరకు ర్యాపిడ్ టెస్టు లు అందుబాటులో ఉన్నాయని…రోజుకు లక్ష 50 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఆరోగ్య శాఖలో ఉన్న అన్ని శ్రేణులు సెలవులు లేకుండా పని చేస్తున్నారని…33 జిల్లాల్లో ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం అన్నారు.కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని గాంధీ ఆస్పత్రి కి తరలించే ఏర్పాట్లు చేశామని…. 11 వేల బెడ్స్ ని ఆక్సిజన్ బెడ్స్ గా మళ్ళీ పునరుద్ధరించాం ప్రయివేటు మెడికల్ కాలేజీలను కూడా సిద్ధంగా ఉంచాం అన్నారు.

ప్రజలకు భయం కల్పించకుండా.. ధైర్యం కల్పిస్తున్నాం…కరోనతో సహజీవనం తప్పదు అన్నారు. మాస్కులు తప్పనిసరి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి లాక్ డౌన్ ప్రసక్తే లేదు..వ్యాక్సిన్ అందరికి ఇస్తాం అన్నారు.

- Advertisement -