విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ నెల 25న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా వరంగల్‌లో నిర్వహించిన లైగర్ ఫ్యాన్‌డమ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పూరి జగన్నాథ్ ఇక్కడ స్టూడియో పెట్టాలని తనకున్న పరిచయాలతో ఇక్కడ షూటింగ్‌లు జరిగేలా చూస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో మాట్లాడి స్థలం ఇప్పించేందుకు కృషిచేస్తానని తెలిపారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ….ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇండియాలో ఎక్కడకు వెళ్లినా విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. ఆ ప్రేమ తెలంగాణ, ఆంధ్రా ప్రజల దగ్గరే మొదలైంది. మీరిచ్చిన ప్రేమ వల్లే ఇండస్ట్రీలో నిలబడ్డానని తెలిపారు. ఈ సినిమాలోని ‘వీ ఆర్ ఇండియన్స్..పోదాం..కొట్లాడదాం..’ అనే డైలాగ్‌తో నేను బాగా కనెక్ట్ అయ్యా’ అని అన్నారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ….అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ యాక్టింగ్ చూసి ఇంత నిజాయితీగా, రియలిస్టిక్‌గా ఎలా చేశాడని ఆశ్చర్యపోయా. నాకు విజయ్ వ్యక్తిత్వంలోని నిజాయితీ బాగా నచ్చుతుంది. అది ఆయన నటనలో కూడా అది కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి హీరోలు ఉండరు అన్నారు.