బీజేపీ కన్నా దొంగలు నయం: ఎర్రబెల్లి

48
dayakarrao

బీజేపీ కన్నా దొంగలు నయం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు . ఎన్నికల మ్యానిపెస్టోలో పెట్టిన ఎనబై శాతం హామీలను నెరవేర్చాం, మిగతావి రాబోయే మూడు ఏండ్ల లో పూర్తి చేస్తాం…ఇప్పటి వరకు లక్షా ముఫ్పై రెండు వేల 899 ఉద్యోగాలు ఇచ్చాం, మరో యాబై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ సిద్దం చేశాం అన్నారు.

సిఎం కేసిఆర్, కేటిఆర్ నాయకత్వంలో అన్ని రంగాల లో ముందజలో ఉన్నాం…బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. కేంద్రం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి రికార్డు స్థాయిలో ధరలు పెంచారు…నల్ల ధనం వెలికి తీసి వందరోజుల్లో ఒక్కొక్కరి కాథాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పావ్ ఎవరికైనా వేశావా?రైల్వేను కూడా ప్రధాని మోడీ ప్రయివేటు పరం చేస్తారని చెప్పారు.

బండి సంజయ్ పిచ్చికూతలు కూస్తడు….రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను కేంద్రం మోసం చేస్తుందన్నారు. రైతులు ధర్నా చేస్తే బిజేపి స్పందించడం లేదు..బిజేపి కన్నా దొంగలు నయం..టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్దిని మేము బహిర్గతం చేశాం, బిజేపి చేసినవి మీరూ మీడియా ఎదుట ఆధారాలతో చెప్పండన్నారు. విభజన చట్టం లో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఇస్తామని చెప్పి ఇతర రాష్ట్రాలకు తరలించావు…కరోనాలో కేంద్రం సహాయం చేయలేదు. మీకు ఎందుకు ఓటేయాలి.?కేంద్రానికి రాష్ట్రం రెండు లక్షల డెబ్బైరెండు వేల కోట్లు పన్నుకట్టాం,లక్షాయాబై వేల కోట్లు మాత్రమే తిగిగి ఇచ్చింది. మిగతా డబ్బు ఇతర బిజేపి పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.