టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి- మంత్రి ఎర్రబెల్లి

167
errabelli
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ ఫేస్ 1, ఫేస్ 2 లలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి జెర్రిపోతుల ప్రభుదాస్ తో కలిసి, ఇంటింటికీ తిరుగుతూ, ప్రతి ఓటరును కలుస్తు ఓట్లు అడుగుతున్నారు. ఇస్త్రీ చేస్తూ…ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నార మంత్రి. ఇందులో భాగంగా కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఎర్రబెల్లి.

మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీలో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజారిటీ తో గెలిపించాలి. కారు గుర్తుకు ఓటు వేసి మన ప్రభుదాస్ ను గెలిపించాలి. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేయడానికి మాకు ఛాన్స్ ఇవ్వండి. సీఎం కేసిఆర్ ఆలోచన, కేటీఆర్ సహకారంతో మొత్తం హైదరాబాద్ విశ్వనగరం గా మారుతున్నది. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.

హైదరాబాద్ ఎన్నడూ లేనంతగా శాంతియుతంగా వుంది. మనకు అభివృధ్ధి కావాలంటే వాళ్ళు ఢిల్లీ నాయకులను అడగాలి. అదే మనకు అభివృద్ది కావాలంటే గల్లీ నాయకులను అడిగినా మనల్ని అభివృద్ధి చేస్తారు. మన వాళ్ళు నిరంతరం అందుబాటులో ఉంటారు. కారు గుర్తుకు ఓటు వేస్తే మన చేతుల్లోనే మన అభివృద్ధి సంక్షేమం వుంటుంది. అదే వేరే వాళ్ళకి వేస్తే అభివృద్ధి సంక్షేమం ఢిల్లీల వుంటుంది. సీఎం కేసిఆర్ ప్రకటించిన కొత్త పథకాలు జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి నాంది పలుకుతాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

- Advertisement -