టీఆర్ఎస్‌కు కన్నడిగులు సంపూర్ణ మద్దతు..

46
b vinod

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కర్నాటక రాష్ట్ర కన్నడిగులు సంపూర్ణ మద్దతు పలికారు. తాజ్, ద్వారకా, ఉడిపి వంటి హోటల్స్, టీ పౌడర్, రియల్ ఎస్టేట్, ఉద్యోగ, న్యాయ రంగాల్లో కన్నడిగులు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. కర్నాటక సాహిత్య మందిర వేదిక ద్వారా బుధవారం బాగలింగంపల్లిలో జరిగిన సమావేశంలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నాను.

అలాగే హెచ్.ఎం.ఎస్. , రైల్వే మజ్దూర్ యూనియన్ జాతీయ నాయకులు శంకర్ రావుతో వినోద్ కుమార్ సమావేశమై టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన అంగీకారాన్ని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రైల్వే ఉద్యోగులు, కార్మికులు టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులకు సహకారాన్ని అందించేలా చూస్తానని శంకర్ రావు హామీనిచ్చారు. అందుకు పార్టీ తరఫున వినోద్‌ కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.