ఇంగ్లాండ్ చేతిలో భారత్‌ ఓటమి..

256
- Advertisement -

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. తమ టెస్టు చరిత్రలో ఆడిన 1000 టెస్టులో చిరస్మరణీయ విజయం సాధించింది. 1000వ టెస్టు ఆడిన తొలి జట్టు ఇంగ్లాండే. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో అనూహ్య ఓటమి పాలైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 110/5తో నాలుగో రోజు, శనివారం ఆట ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఇంగ్లాండ్ ఓపెనర్‌ బెన్‌స్టోక్స్‌ నాలుగు వికెట్లతో టీమిండియా పతనం శాసించాడు.

India vs England

లక్ష్యం చిన్నదే అయినా బౌలర్లకు పిచ్ నుంచి సహకారం లభించడంతో ఛేదన ఇబ్బందిగా మారింది. కోహ్లీ మాదిరిగా ఒక్క బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలబడినా భారత్ అలవోకగా విజయం సాధించేది. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్(149) అద్భుత సెంచరీ చేయకపోతే భారత్ భారీ పరాజయం ఎదుర్కోవలసి వచ్చేది. విరాట్‌ కోహ్లీ (51; 93 బంతుల్లో 4×4), హార్దిక్‌ పాండ్య (31; 61 బంతుల్లో 4×4) మినహా మరెవ్వరూ రాణించలేదు.

- Advertisement -