రెండో గెలుపు నమోదు చేసిన ఇంగ్లాండ్..

35
- Advertisement -

ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ రెండో గెలుపు నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో గెలుపొందింది. 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది.తేజ 41 నాటౌట్‌, కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ 38 పరుగులతో రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలం అయ్యారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 339 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ 84 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 108 పరుగులు చేయగా మలాన్‌(87), క్రిస్‌ వోక్స్‌(51) పరుగులు చేశారు. ప్రపంచకప్‌లో తొలి సెంచరీ చేసిన స్టోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక ఇంగ్లాండ్ చివరి మ్యాచ్‌ 11న పాకిస్థాన్‌తో తలపడనుండగా, 12న నెదర్లాండ్స్‌..భారత్‌తో తలపడనుంది.

Also Read:ధరణి రద్దయితే.. దళారులదే రాజ్యం!

- Advertisement -