అక్రమ బ్యానర్లను తొలగించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

203
Banners

న‌గ‌రంలో అక్ర‌మ ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల తొల‌గింపుపై జిహెచ్ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నేడు ప్ర‌త్యేక డ్రైవ్‌ను నిర్వ‌హించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన 24 బృందాలు నేడు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో తొమ్మిదివేల‌కు పైగా బ్యానర్లు, పోస్ట‌ర్లు, ఫ్లెక్సీల‌ను తొల‌గించారు. వీటితో పాటు న‌గ‌రంలోని ఫుట్‌పాత్‌లను ఆక్ర‌మిస్తూ ఏర్పాటుచేసిన ప‌లు సైన్‌బోర్డుల‌ను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తొల‌గించాయి.

నేడు సాయంత్రం వ‌ర‌కు నిర్వ‌హించిన ఈ స్పెష‌ల్ డ్రైవ్‌లో ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు, పోస్ట‌ర్లను పెద్ద ఎత్తున తొల‌గించారు. స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌లో భాగంగా చేప‌ట్టిన ప‌లు స్పెష‌ల్ డ్రైవ్‌ల‌లో భాగంగా ఇప్ప‌టికే ప‌నికిరాని వ‌స్తువుల సేక‌ర‌ణ‌, భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల తొల‌గింపు, వార్డుల‌వారిగా పారిశుధ్య కార్య‌క్ర‌మాల నిర్వ‌హణ త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను జిహెచ్ఎంసి చేప‌డుతోంది. ఈ ఫ్లెక్సీల తొల‌గింపు కార్య‌క్ర‌మం నిరంత‌రం కొన‌సాగించనున్నట్టు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి తెలిపారు. న‌గ‌రంలో అనుమ‌తిలేని అక్ర‌మ ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటుచేస్తే భారీ ఎత్తున జ‌రిమానాల‌ను విధించ‌నున్న‌ట్టు ఆయన ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Enforcement officers Remove illegal Banners And Flexs in hyderabad,