జయలలిత అంత్యక్రియలకు ఏర్పాట్లు..

221
- Advertisement -

అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన జయలలిత పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో మొదట ఆమె అధికార నివాసం పోయెస్‌ గార్డెన్‌కు తరలించారు. జయ వారసుడిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌ సెల్వం, ఇతర మంత్రులు, ఏఐడీఎంకే పార్టీ ముఖ్యనేతలు ఆ కాన్వాయ్‌ ని అనుసరించారు. జయ పార్థివదేహం పక్కనే ఆమె నెచ్చెలి శశికళ ఉన్నారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్ధం రాజాజీ హాల్‌ లో జయలలిత పార్ధీవదేహన్ని ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 5, 6 గంటలకు చెన్నై మెరీనా బీచ్‌ వద్ద గురువు ఎంజీఆర్‌ సమాధి పక్కన మంగళవారం సాయంత్రం 5-6 గంటల మధ్య జయలలిత అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అమ్మకు కడసారి వీడ్కోలు పలకనున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెల్లవారుజామున వెల్లడించాయి.

jayalalithaa-body_

కొద్దిసేపు పోయెస్‌ గార్డెన్‌లో ఉంచిన అనంతరం జయ పార్థివదేహాన్ని ప్రఖ్యాన రాజాజీ పబ్లిక్‌ హాల్‌కు తరలింంచారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలోని ఇతర పార్టీల నాయకులు, ప్రజలు.. రాజాజీ హాలులోనే జయ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. చెన్నై నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.

jayalalithaa-body_

వారం రోజులు సంతాపదినాలు
ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే కన్నుమూసిన జయలలిత మృతికి సంతాపంగా తమిళనాడులో ఏడు రోజులు సంతాపదినాలు పాటించనున్నారు. మూడు రోజుల పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -