ఎలక్షన్ రిపోర్ట్ : దుబ్బాక బి‌ఆర్‌ఎస్ దే!

38
- Advertisement -

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నియోజిక వర్గాల వారీగా పార్టీల బలా బలహీనతలపై అనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఏ ఏ నియోజిక వర్గాల్లో ఏ పార్టీ బలంగా ఉంది? ఏ పార్టీ బలహీనంగా ఉంది అనే దానిపై రకరకాల డిబేట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని సంక్లిష్ట నియోజిక వర్గాల్లో ఈసారి పోరు రసవత్తారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి నియోజిక వర్గాల్లో దుబ్బాక కూడా ఒకటి. ఇక్కడి ప్రజలు ఎప్పటికప్పుడు విభిన్నంగానే తీర్పునిస్తూ వచ్చారు. దుబ్బాకలో కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, బి‌ఆర్‌ఎస్ నాలుగు సార్లు అధికారంలోకి వచ్చింది. .

అయితే 2018లో గెలుపొందిన బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగ రెడ్డి మరణం తరువాత ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలుపొందారు. దుబ్బాక గ్రాండ్ రిపోర్ట్ పరిశీలిస్తే ఎప్పటికప్పుడు విజయం చేతులు మారుతూ వచ్చింది. దాంతో ఈసారి జరిగే సాధారణ ఎన్నికల్లో గెలుపెవరిదనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అధికార బి‌ఆర్‌ఎస్ కె ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ పై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది. పైగా గత కొన్నాళ్లుగా ఆయన పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు.

ఈసారి రఘునందన్ కు దుబ్బాక టికెట్ దక్కడం కూడా కస్టమే అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటు కాంగ్రెస్ సైతం దుబ్బాక సీటుపై ఇంకా డైలమాలోనే ఉంది. ఎందుకంటే వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే హస్తం పార్టీ ఈ సీటును త్యాగం చేయాల్సిన పరిస్థితి. ఇక అధికార బి‌ఆర్‌ఎస్ ఇప్పటికే దుబ్బాకలో పోటీ చేయబోయే అభ్యర్థిని ప్రకటించి గెలుపు విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ వుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక బరిలో నిలిపారు అధినేత కే‌సి‌ఆర్‌. నియోజిక వర్గ ప్రజాలో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డిపై సానుకూల భావం ఉండడంతో ఈసారి కూడా దుబ్బాకలో బి‌ఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:నవదీప్‏కు ఈడీ నోటీసులు..

- Advertisement -