నేడు టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం..

250
KCR
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని చాలా వరకు పరిష్కరించారు సీఎం కేసీఆర్. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలోని అన్నివర్గాల వారి అవసరాలు, కష్టాలను గుర్తించి యుద్దప్రాదిపదకన పనులు కొనసాగించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ముందుకుసాగారు. రాష్ట్రంలో ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తున్నా ఘనత సీఎం కేసీఆర్‌ది. ఇక రానున్న ఎన్నికల్లో కూడా గెలిచి రాష్ట్ర ప్రజలకు మరింత చేయూతనివ్వాలని టీఆర్ఎస్ పార్టీ సంకల్పించింది.

KCR

అయితే.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్లలో జరిగిందని గుర్తించిన ప్రజలు స్వచ్చందంగా ముందుకువచ్చి తమ ఓటు గులాబి జెండాకే అంటూ మూకుమ్మడి ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారంలో మరింత జోరు పెంచాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థులకు దిశానిర్ధేశం చేసేందుకు, ఈ రోజు తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులతో సమావేశమవుతారు. ఈ సదస్సులో అభ్యర్థులకు పలు సూచనలు చేయనున్నారు.

పాక్షిక మేనిఫెస్టో ప్రకటనతో మరోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, వివిధ పద్దతులు, తదితర అంశాలపై అభ్యర్థులకు సీఎం అవగాహన కల్పించనున్నారు. పార్టీ అభ్యర్థులను ప్రచారానికి సిద్దం చేయడం, ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ఓటు హక్కు వినియోగం, పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసే పథకాలు వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

- Advertisement -