- Advertisement -
మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని…సద్గురు ఆశ్రమంలో నిర్వహించే శివరాత్రి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానం మేరకు… ఎంపీ సంతోష్‌కుమార్ సతీమణితో కలిసి కోయంబత్తూర్‌లోని ఈశా ఆశ్రమానికి చేరుకున్నారు. ఆనంతరం ఈశా ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఎంపీ సంతోష్‌కుమార్ సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు మరియు ప్రకృతితో ఉన్న మానవ సంబంధాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈశా వాలంటీర్లు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
గుండె ఆరోగ్యాన్నిపెంచే.. ఆహారపు అలవాట్లు!
దేశ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
సీఎం ఫాంహౌస్‌లో గ్రీన్ ఛాలెంజ్..
- Advertisement -