మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్దులకు సన్న బియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్రాఫ్ట్ పాలసీపై రాష్ట్రాల సూచనలు, సలహాలు అడిగినట్లు తెలిపారు. 8, 9, 10 తరగతుల్లో వృత్తి విద్య అమలు చేయాలని చెప్పారు.. దీనిని కూడా కేంద్రమే భరించాలని సూచించాం.
ఒత్తిడిలో ఉండే విద్యార్థుల కోసం.. జిల్లాకు ఒక కౌన్సిలింగ్ సంస్థ పెట్టాలని కోరినం. రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ ను పరిశీలంచాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంతో సంబంధం లేకుండా విద్య వ్యాప్తికి చాలా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంలో 60% కేంద్రం, 40% రాష్ట్రం భరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం 7వ తరగతి వరకే అమలు చేస్తే.. మన రాష్ట్రంలో 8, 9, 10వ తరగతి వరకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం.
మోడల్ స్కూల్ వ్యవస్థను కేంద్రం పక్కనపెడితే.. స్వంతంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వాటిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గురుకులాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రయివేట్ పాఠశాలలు మానేసి.. ప్రభుత్వ గురుకులాలో విద్యార్థులు చేరుతున్నారు. పేద విద్యార్థుల విదేశీ విద్య కోసం 20లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నాం . సుమారు 1995 మంది విద్యార్థులు విదేశాలలో విద్య అభ్యసిస్తున్నట్లు తెలిపారు.