త్వరలో విద్యాకమిషన్:సీఎం రేవంత్ రెడ్డి

11
- Advertisement -

త్వరలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వాళన చేసి ప్రారంభించిన రేవంత్…ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అనేక మంది ఐపీఎల్‌,ఐఏఎస్‌లు అయ్యారని తెలిపారు.

తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని చెప్పారు. మట్టిలో మాణిక్యాలుగా రాణిస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువచ్చారని విద్యార్థులను ఆయన అభినందించారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానంటూ చెప్పారు.

త్వరలో విద్యా కమిషన్‌తో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులు, రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా ఈ కమిషన్ పనిచేస్తుందని వెల్లడించారు.

Also Read:  నూకాంబికా అమ్మవారి సన్నిధిలో పవన్

- Advertisement -