లిక్కర్ స్కాం..మరో ఎమ్మెల్యేకు నోటీసులు

74
mla
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామంలో మరో ఎమ్మెల్యేకు నోటీసులు అందాయి. ఢిల్లీ రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌ కు నోటీసులు ఇచ్చింది ఈడీ. విచారణకు రావాలని దుర్గేశ్‌కు నోటీసుల్లో పేర్కొంది. ఇక ఈడీ నోటీసులపై డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఎన్నికల ఇంచార్జ్‌ అయిన దుర్గేశ్‌కు.. ప్రభుత్వ లిక్కర్‌ పాలసీతో ఏం సంబంధముందని ప్రశ్నించారు. ఈడీ టార్కెట్‌ లిక్కర్‌ పాలసీయా లేకా ఎంసీడీ ఎన్నికలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇక ఈ కేసులో నోటీసులు అందుకున్న వారిసంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌, ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్‌కు దర్యాప్తు సంస్థ నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -