డేరా బాబా ఆస్తులెంతో తెలుసా..!

214
ED, I-T dept investigate Ram Rahim properties
- Advertisement -

అత్యాచార కేసుల్లో వివాదాస్పద డేరా బాబా గుర్మీత్ సింగ్ జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. డేరాబాబాను 20 సంవత్సరాలు దోషిగా ప్రకటించాక పంచకుల సహా చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో వందలాది కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దీనికి పరిహారం చెల్లించాలంటూ డేరా సచ్ఛ సౌధాను న్యాయస్థానం ఆదేశించింది.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఐటీ,ఈడీ డేరా ఆస్తుల విలువను హైకోర్టుకు తెలిపింది. డేరా మొత్తం ఆస్తుల విలువ రూ.1453 కోట్లని తెలిపింది. గుర్మీత్‌  భారీగా ఆస్తులు కూడబెట్టారని హర్యాణా ప్రభుత్వం వెల్లడించింది. డేరా ఆశ్రమ కేంద్రమైన సిర్సాలో 1453 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని … అంబాలాలో 32.20 కోట్ల విలువైన ఆస్తులు, ఝాజ్జర్‌ లో 29.11 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులు, ఫతేబాద్‌ లో 20.70 కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

అలాగే డేరా బాబాకు 504 బ్యాంకు ఖాతాలున్నాయని వెల్లడించింది. వాటిల్లో సుమారు 75 కోట్ల రూపాయలు ఉన్నాయని న్యాయస్థానానికి చెప్పింది. ఒక్క సిర్సా జిల్లాలోనే 495 బ్యాంకు ఖాతాలు ఉండడం విశేషం. ఈ మొత్తం ఆస్తుల విలువ 1600 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని హర్యాణా ప్రభుత్వం అంచనా వేసింది.

మరోవైపు డేరా బాబా దత్తపుత్రిక కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతునే ఉంది. తనకు ప్రాణహాని ఉందని…పంజాబ్, హర్యానా డ్రగ్ మాఫియా తనను వెంటాడుతోందని ముందస్తు  బెయిల్ ఇవ్వాలని హనిప్రీత్ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

- Advertisement -