ఆ గుర్తులపై ఈసీ నిషేధం

31
- Advertisement -

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థులు నాలుగు చిహ్నాలను ఉపయోగించకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

వీటిలో ఆటో రిక్షా, క్యాప్, ఐరన్ బాక్స్‌, ట్రక్ ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆయా ఎన్నిక‌ల గుర్తులు.. ప్ర‌ధాన పార్టీలు, గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ఎన్నిక‌ల గుర్తుల‌ను పోలి ఉన్న నేప‌థ్యంలో ఈ చిహ్నాల‌ను ఎవ‌రికీ కేటాయించ‌బోమ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.

స్వ‌తంత్ర అభ్య‌ర్థులు, రిజిస్ట‌ర్డ్ పార్టీలు.. ఈ గుర్తులు మిన‌హా ఇత‌ర గుర్తుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని వివ‌రించింది.

Also Read:ముల్తానీ మట్టి మొఖానికి మంచిదేనా?

- Advertisement -