ముల్తానీ మట్టి మొఖానికి మంచిదేనా?

47
- Advertisement -

చర్మ సౌందర్యనికి ఉపయోగించే ఇన్ గ్రేడియన్స్ లలో ముల్తానీ మట్టికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని పూర్వం నుంచి కూడా చర్మ సౌందర్యానికి సహజసిద్ద వనరుగా ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొఖాన్ని కాంతివంతంగా చేయడంలోనూ, మొఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగించడంలోనూ ముల్తానీ మట్టి ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందుకే చాలమంది ఇతరత్రా మెడిసన్స్ కన్నా ముల్తానీ మట్టే మంచిదని భావిస్తూ ఉంటారు. ఇందులో మెగ్నీషియం, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్ వంటి సహజసిద్ద వనరులు ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. .

ముఖ్యంగా మొఖాన్ని కాంతివంతంగా ఉండాలని యవ్వనంగా కనిపించాలని కోరుకునే ఈ ముల్తానీ మట్టి ఒక వరంగా చెబుతుంటారు బ్యూటీ నిపుణులు. చాలమంది మొఖంపై విపరీతమైన జిడ్డుతో బాధపడుతూ ఉంటారు. ఆయిల్ ఫేస్ తో నలుగురిలో తిరగడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మొఖానికి ముల్తానీ మట్టి రాసుకుంటే జిడ్డు సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే జిడ్డును గ్రహించే గుణాలు ఈ మట్టిలో అధికంగా ఉంటాయి. ఇక మొఖం పై మొటిమల ఇబ్బంది పడే వారు కూడా ఈ మట్టిని ఫేస్ ప్యాక్ లా ఉపయోగించువచ్చు.

ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటు ఫేస్ మృదువుగా మారుతుంది. ఇక డార్క్ స్కిన్ తో భాదపడే వారు కూడా ముల్తానీ మట్టి ఉపయోగించి కాంతివంతంగా మార్చుకోవచ్చు. అయితే కేవలం ముల్తానీ మట్టిని మాత్రమే అప్లై చేసుకుంటే పెద్దగా ఫలితాలు కనిపించవని చెబుతున్నారు నిపుణులు. ఈ మట్టితో పాటు పసుపు లేదా రోజ్ వాటర్, లేదా బత్తాయి తొక్కల యొక్క పొడి వంటివి మిశ్రమంగా చేర్చుకొని ఫేస్ ప్యాక్ చేసుకుంటే మేలని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన 10 లేదా 15 నిముషాల తరువాత చల్లటి నీటితో మొఖాన్ని కడిగేసుకుంటే మొఖంపై ఉండే డార్క్ పింపుల్స్ అన్నీ మటుమాయం అవుతాయట. అందువల్ల సహజసిద్దంగా లభించే ముల్తానీ మట్టి మొఖానికి ఎంతో మేలని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు.

Also Read:BCCI:కోచ్ పదవికి దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -