ఢిల్లీలో భూ ప్రకంపనలు..

32
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాదిన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో మధ్యాహ్నం 2.40 గంటలకు భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూమి కంపించింది. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 220 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ప్రకంపనల ధాటికి ఢిల్లీలోని ఇళ్లలోని సామాగ్రి కదలగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజలు ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఢిల్లీ తో పాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లోనూ భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది.

Also Read:దళిత బంధుపై కాంగ్రెస్‌ను నిలదీద్దాం:సత్యవతి

- Advertisement -