- Advertisement -
తెలంగాణలో ఎంసెట్ పీజీ ఈసెట్‌ల నోటిఫికేషన్‌ల షెడ్యూల్‌ను ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ ప్రొ. లింబాద్రి విడుదల చేశారు. మార్చి 3నుంచి ఏప్రిల్ 4వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 7 నుంచి 9వరకు ఇంజినీరింగ్ మే10నుంచి 11వరకు అగ్రికల్చర్ ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రొ. లింబాద్రి అన్నారు. పీజీ ఈసెట్ షెడ్యూల్‌నూ అధికారులు విడుదల చేశారు. మార్చి 3నుంచి ఏప్రిల్ 30వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఆలస్య రుసుంతో మే24వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. కాగా మే29 నుంచి జూన్1 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఎంసెట్ షెడ్యూల్ ఇలా….
- నోటిఫికేషన్ తేదీ 28-02-2023
- ఆన్‌లైన్ అప్లికేషన్ మార్చి3న ప్రారంభం
- ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్30
- ఆన్‌లైన్ అప్లికేషన్లో మార్పులు చేసుకునే తేదీలు 02-05-2023 నుంచి 04-05-2023వరకు
- 250రూపాయల అపరాద రుసుము 05-05-2023 నాటికి
- 500రూపాయల అపరాద రుసుము 10-05-2023 నాటికి
- 2500రూపాయల అపరాద రుసుము 15-05-2023 నాటికి
- 5000రూపాయల అపరాద రుసుము 24-05-2023వరకు అవకాశము కలదు.
- అభ్యర్థులు హాల్ టికెట్స్‌ను మే 21 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- పరీక్షా తేదీలు మే29నుంచి జూన్1వరకు ఉంటాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి…
మొక్కలు నాటిన పర్వతారోహకుడు అన్మిష్ వర్మ..
తిరుమల అప్‌డేట్..
బయోఏషియా సదస్సు ప్రారంభం..
- Advertisement -