తెలంగాణలో ఎండ తీవ్రత తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. గడిచిన 3 రోజుల్లో వడదెబ్బతో దాదాపు 30 మంది మృతి చెందారు. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.
ఇక రానున్న 24 గంటల్లో బంగాళాఖాతం నుండి తేమతో కూడిన ఆగ్నేయ గాలులు లోతుగా ప్రవహించడంవల్ల తెలుగు రాష్ట్రాల్లో వేడిమి నుంచి కొంత ఉపశమనం ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మధ్య/ఉత్తర తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
తూర్పు తెలంగాణలో వేడిమి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, చాలా చోట్ల ఉష్ణోగ్రత 40°C కంటే ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని చోట్ల 43°C వరకు చేరవచ్చు. హైదరాబాద్ గరిష్ఠ ఉష్ణోగ్రత 38-39°C ఉండే అవకాశం ఉంది, మధ్యాహ్నం లేదా సాయంత్రం వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ మరియు దక్షిణ ఏపీ ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, కొన్ని చోట్ల 42-43°C వరకు చేరవచ్చు అన్నారు. ఉత్తర ఏపీలోతేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విశాఖపటణం గరిష్ఠ ఉష్ణోగ్రత 35°C ఉండే అవకాశం ఉంది, తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
Also Read:ఇంటర్ ఫెయిల్.. సివిల్స్‌లో సత్తా

