- Advertisement -
దేశం వ్యాప్తంగా యువకులు పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోడీ.. యువతకు కీలకమైన సూచనలు చేశారు. నేటి నుంచి శరన్నవరాత్రుళ్లు ప్రారంభం సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలంతా సంతోషంగా ఉండాలని దుర్గామాతను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తూ ఇప్పటికే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పొగాకు, ఈ సిగరెట్లు, సిగరెట్లతో ఆరోగ్యానికి నష్టం జరుగుతుందన్న ప్రధాని.. వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
- Advertisement -