లండన్‌లో కేటీఆర్‌కు సర్‌ప్రైజ్‌

76
car ktr
- Advertisement -

రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా లండన్‌లో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. అయితే పర్యటనలో భాగంగా లండన్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ఎన్నారై టీఆర్ఎస్‌ నేత సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌తో ఆశ్చర్యపర్చారు.

యుకెఎన్నారై టిఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసారికి చెందిన ఆడి కారు ప్రత్యేకంగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మంత్రి కేటీఆర్ సైతం ఈ కారు విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రస్తావించడంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. ఎందుకంటే ఆ కారు నెంబర్‌ ప్లేట్‌పై మంత్రి పేరు ‘కేటీఆర్‌’ అని ఉంది. అది ‘TR 5I KTR’. అంతేకాదు నెంబర్ ప్లేట్ చూస్తే ఇందులో TR5I KTR టీఆర్ఎస్ అని వచ్చేలా కూడా ఉంది.

యుకేలోని తెలంగాణ ఎన్నారైలు ఘనస్వాగతం పలికినందుకు ధన్యవాదాలు….ముఖ్యంగా ప్రత్యేక నంబర్ ప్లేట్ (sic)తో తన కారులో నాకు రైడ్ ఇచ్చిన @ASHOKDUSARI గారూ NRI TRS UK అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు కేటీఆర్.

- Advertisement -