ఐదుగురు భామలతో ఓకేబంగారం హీరో…!

138
Dulquer Salmaan's Solo updates

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగానే కెరీర్ ను మొదలెట్టినప్పటికీ.. అనతికాలంలో కథానాయకుడిగా “బెంగుళూరు డేస్, చార్లీ, ఒకే బంగారం” వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్‌గా నిత్యామీనన్‌తో కలిసి 100 డేస్ ఆఫ్ లవ్ సినిమాతో అలరించాడు. తాజాగా బైలింగ్యువల్ మూవీ సోలోగా ముందుకు వస్తున్నాడు. తమిళం, మలయాళంలో ఈ సినిమా విడుదల కానుంది.

బిజాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోండగా, ఇందులో నటీనటులను రెండు ఇండస్ట్రీల నుండి తీసుకున్నారట. ఇంక ఈ చిత్రంలో 5 గురు భామలు ప్రధాన పోషించనున్నట్టు సమాచారం. అన్ అగస్తీన్ కి ఈ చిత్రం కమ్ బ్యాక్ ఫిలిం కాగా, ఆర్తి వెంకటేష్ ఫీమేల్ లీడ్ పోషిస్తోంది. మరో ముగ్గురు హీరోయిన్లు ఎవరుంటానే దానిపై యూనిట్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 11న థియేటర్లలోకి రానుందని చెబుతున్నారు.

dulqer salman

సూపర్ స్టార్ మమ్ముట్టి వారసుడిగా 2012లో మళయాల సినీ పరిశ్రమలో తెరగేంట్రం చేసిన దుల్కర్, ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓకే బంగారం సినిమాలో దుల్కర్‌ నటనపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. దుల్కర్ తన తండ్రి మమ్ముట్టి కంటే అద్భుతమైన నటుడని, మమ్ముట్టియే దుల్కర్ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలని వర్మ ట్వీట్ చేశాడు. ఇప్పటివరకూ దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టికి సాధ్యం కాని ఇతర భాషల్లో స్టార్‌డమ్ సంపాదించడమనే ఫీట్‌ను దుల్కర్ అతి త్వరలోనే సాధించగలడని వర్మ తెలిపిన విషయం విధితమే.