కాంగ్రెస్ ఓ ఎండ్రికాయల పార్టీ:ప్రభాకర్ రెడ్డి

42
- Advertisement -

నియోజక వర్గ సమస్యల కోసమే సీఎం రేవంత్‌ని కలిశామన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో సునీతా లక్ష్మారెడ్డి,గూడెం మహిపాల్ రెడ్డి ,మాణిక్ రావులతో మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి….. సీఎం రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు కదా అని ప్రశ్నించారు. సీఎం ను కలిసినంత మాత్రాన మేమేదో పార్టీ మారుతున్నట్టు దుష్రచారం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ ఓ ఎండ్రికాయల పార్టీ అని…..అందులో ఎవరు చేరుతారు ? అన్నారు. మెదక్ ఉద్యమాల గడ్డ ..ఉద్యమం లో కేసీఆర్ తో ఉన్నాం .ఇక ముందు కూడా ఉంటాం అన్నారు. కాంగ్రెస్ వాళ్ళే ఈ దుష్ప్రచారం చేస్తున్నారు…..నేను ప్రధానిని కూడా కలిశాను బీజేపీ లో చేరుతున్నట్టా ఆలోచించాలన్నారు.

మంత్రులను కూడా సమస్యల పై కలుస్తున్నా …..కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు పై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. మెదక్ పార్లమెంటు పై ఎగిరేది గులాబీ జెండానే..రాజకీయాల్లో ఉన్నన్నీ రోజులు బీ ఆర్ ఎస్ లోనే ఉంటానని తెలిపారు. ప్రజల కోసం పోరాడే పార్టీ బీ ఆర్ ఎస్… కోమటి రెడ్డి రైతు బంధు రాదనే వారిని చెప్పుతో కొట్టాలి అంటున్నారు….ఇదేనా సంస్కారం ఆలోచించాలప్పానే. బీ ఆర్ ఎస్ ను బొంద పెట్టే వాళ్ళు ఎవరూ లేరు…..నా నియోజక వర్గం లో ఈ రోజు మంత్రి పర్యటిస్తుంటే నాకు సమాచారం లేదు అన్నారు. తనకు అదనపు భద్రత కూడా కావాలన్నారు ప్రభాకర్ రెడ్డి.

Also Read:కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తేలేదు:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

- Advertisement -