ఎండు కొబ్బరితో గుండె సమస్యలకు చెక్!

20
- Advertisement -

సాధారణంగా ఎండు కొబ్బెరిని మసాలా దినుసులుగా వాడుతుంటాము. ఆయా కూరల్లో ఎండు కొబ్బరి వేయడం వల్ల వాటి యొక్క రుచి మరింత పెరుగుతుంది. కేవలం కూరల్లో మాత్రమే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా ఎండు కొబ్బరి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎండు కొబ్బరి తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు ఏర్పడతాయని కొందరు భయపడుతుంటారు. అందులో నిజం లేకపోలేదు. అయితే తగు మాత్రంలో ఎండు కొబ్బరి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతిరోజూ ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దురమౌతాయట. ఇంకా మెదడు పనితీరు కూడా మెరుగుపడి మతిమరుపు వంటి సమస్యలు దరిచేరవట. .

ఇంకా ఎండు కొబ్బరిని మితంగా తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే బెల్లం ఎండుకొబ్బరి మిశ్రమంగా తింటే రక్తహీనత దూరమౌతుంది. అంతే కాకుండా పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కొబ్బరిలో ఫినోలిన్ సమ్మేళనలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల రక్తకణాల వృద్దిని పెంచడంతో పాటు రక్త ప్రసరణ కూడా సాఫీగా జరిగేలా సహాయ పడుతుంది. ఇంకా స్త్రీలలో తరచూ వేదించే ఐరన్ లోపాన్ని కూడా ఎండుకొబ్బరి దూరం చేస్తుందట. అయితే దీనిని అధికంగా తీసుకుంటే మాత్రం అనారోగ్య తిప్పలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండు కొబ్బరి ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:TTD: పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి

- Advertisement -