ట్రంప్ మరో సంచలన నిర్ణయం

2
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్‌..తాజాగా తాత్కాలిక వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.2022 అక్టోబరు తర్వాత ఆ నాలుగు దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చినవారికి ఈ బహిష్కరణకు గురవుతున్నారు.

అమెరికా వ్యాప్తంగా 5 లక్షల మందికిపైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేశారు. మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ సంచలన ప్రకటన చేసింది.

క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజువెలా దేశాలకు చెందిన 5,32,000 మంది వలసదారులకు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్లు హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. నెల రోజల్లో వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు తెలిపింది.

Also Read:మొబైల్ డేటా..సేవ్ చేసే టిప్స్!

- Advertisement -