తల నొప్పిగా ఉందని డాక్టర్ వద్దకు వెళితే..కామంతో రెచ్చిపోయాడు

181
Doctor

రోగులు వైద్యులను కనిపించే దేవుడితో సమానంగా చూస్తారు. తాజాగా ఓ వైద్యుడు వైద్య వృత్తికే చెడ్డపేరు తెచ్చే విధంగా రోగితో ప్రవర్తించాడు. తలనొప్పిగా ఉందని వైద్యుని దగ్గరకు వెళితే అతడు కామంతో రెచ్చిపోయాడు. వివరాల్లోకి వెళితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు గత కొద్ది రోజులుగా తీవ్రమైన తలనొప్పి వస్తుండటంతో దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లింది.

అక్కడ ఉన్న డాక్టర్ బాలరాజుకు తన బాథను చెప్పుకుంది. దీంతో తలనొప్పి తగ్గాలంటే కొన్ని టెస్ట్ లు చేయాలని ఆమెను ఒక రూంలోకి తీసుకెళ్లాడు డాక్టర్ బాలరాజు. రూం ఒక స్ట్రేచర్ పై ఆమెను పడుకోబెట్టి తలనొప్పి తగ్గాలంటే మసాజ్ చేయాలి అని చెప్పాడు. దీంతో ఇదే అదునుగా భావించన డాక్టర్ బాలరాజు పేషెంట్ శరీరంపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో బయటకు వచ్చిన రోగి లోపల జరిగిన ఘటనను తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో బాధితులురాలిని తీసకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. బాధితులరాలి ఫిర్యాదు మేరకు డాక్టర్ బాలరాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.