తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో తమిళనాట విషాదఛాయలు అలుముకున్నాయి. అమ్మ ఇక లేరంటూ రాష్ట్ర్రవ్యాప్తంగా శోకసంద్రంలో మునిగిపోయింది. 75 రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన జయ..చివరకు తుదిశ్వాస విడిచింది. జయలలిత మృతితో ఇప్పటికే దిగ్బ్రాంతిలో మునిగిన తమిళనాడు ప్రజానికాన్ని మరో ఆందోళన వెంటాడుతోంది. తమిళనాడు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న..మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత..డిఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా గత నెల రోజుల నుంచి తరుచు అనారోగ్యానికి గురి అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 90 పదుల వయసులోకి అడుగుపెట్టిన కరుణానిధి..గత పదిరోజుల క్రితం అస్వస్థతకు లోను కావడంతో చికిత్స కోసం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరాడు.
ప్రస్తుతానికైతే కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ ఇటీవలె ఓ ప్రకటనలో వెల్లడించాడు. మరో రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని స్టాలిన్ తెలిపారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్న కరుణానిధి..ఆస్పత్రి నుంచే జయలలిత మృతికి సంతాపం ప్రకటించాడు. అయితే ప్రస్తుతానికైతే కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నా…ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని తమిళనాట ఒక్కింత ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అమ్మ మృతితో పెద్ద అండను కోల్పోయిన తమిళ ప్రజలకు..కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన మరింత అధికమైంది.