గుండు లుక్‌తో షాకిచ్చిన చిరు..!

175
chiru

మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్‌కు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షూటింగ్స్ బ్రేక్ ప‌డ‌టంతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స‌రదాగా ఫ్యామిలీతో క‌లిసి టూర్ కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా లాక్ డౌన్ టైంలో గ‌డ్డం, మీసం తీసేసి న్యూ లుక్ లో క‌నిపించిన చిరు..ఇపుడు మ‌రో లుక్ తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తున్నాడు. ఈ సారి చిరు గుండుతో క‌నిపిస్తున్నాడు. బ్లాక్ గాగుల్స్ కంప్లీట్ గా నున్నటి గుండుతో దిగిన ఫొటోను ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు.

అయితే చిరంజీవి నిజంగానే గుండు చేయించుకున్నారా..? లేదంటే త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్టు కోసం ఇలా ఫొటోషూట్ లో ఏమైనా పాల్గొన్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా చిరంజీవి గుండుతో క‌నిపిస్తూ అభిమానుల‌ను ఆలోచ‌న‌లో ప‌డేశాడు. మ‌రి ఈ కొత్త లుక్ వెనుకున్న ర‌హ‌స్య‌మేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.