టాలీవుడ్ కు ఎంతో మంది కొత్త నటీనటులను పరిచయం చేశాడు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభం తీసుకువచ్చే కథలను ఎంచుకుంటాడు ఈ దర్శకుడు. శేఖర్ కమ్ముల చివరగా తీసిని మూవీ ఫిదా. ఈసినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈసినిమాలో కూడా కొంత మంది నూతన నటీనటులను పరిచయం చేశారు.
ఫిదా సినిమా తర్వాత మరే సినిమా చేస్తున్నట్లు ప్రకటించలేదు. ఇన్ని రోజులు మంచి కథను సిద్దం చేసుకునే పనిలో ఉన్నాడు. తాజాగా ఆయన చేయబోయే నూతన చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సికింద్రబాద్ లోని గణపతి ఆలయంలో నిర్వహించారు. ఆయనతో పాటు నిర్మాతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. కొత్త నటీనటులతో శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. నటీనటుల ఎంపిక కూడా పూర్తైనట్టు సమాచారం. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టు చెబుతున్నారు.